Asianet News TeluguAsianet News Telugu

బాలికా నిల‌యంలో ఉపసాన - రామ్ చరణ్.. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. స్టార్స్ దసరా సెలబ్రేషన్స్

కుటుంబ సంస్కృతిని ప‌రిర‌క్షించేలా ఉపాస‌న - రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు... ఫ్యామిలీతో  విజయ్ దేవరకొండ విజయదశమి పండగను జరుపుకున్నారు. ఇందుకు ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 

Ram Charan and  Vijay Deverakonda  Dussehra Celebrations NSK
Author
First Published Oct 23, 2023, 9:38 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ తారలు కూడా దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్  చరణ్ (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela)తో కలిసి వినూత్నంగా వేడుక జరుపుకున్నారు. మ‌న కుటుంబ సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించి, భావిత‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త మ‌న మీద ఎంతైనా ఉంటుంది. అలాంటి బాధ్య‌త‌ను అద్భుతంగా నెర‌వేర్చారు ఉపాస‌న కామినేని కొణిదెల‌, ఆమె భ‌ర్త‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని అనుస‌రించి వారు ద‌స‌రా ఉత్స‌వాల‌ను జ‌రుపుకున్నారు. 

ఉపాస‌న కుటుంబం త‌ర‌ఫున వ‌చ్చిన ఓ సంస్కృతిని ఆచ‌రించి కొన‌సాగించారు రామ్‌చ‌ర‌ణ్‌. బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో క‌లిసి ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు. ఉపాస‌న బామ్మ‌, ఈ సేవా స‌మాజ్‌కి మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆస‌రాగా ఉన్నారు. ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి బాలికా నిల‌యం సేవా స‌మాజ్ లోని అనాథ బాలిక‌ల‌తో క‌లిసి ఉత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. ప్రేమ‌ను పంచాలి. సానుకూల దృక్ప‌థాన్ని స‌మాజంలో నాటాలి, సంతోషంగా జీవించాల‌నే ఆలోచ‌న‌ల‌ను బాలిక‌ల‌లో పెంపొందించేలా స్టార్ క‌పుల్ ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజ‌యాన్ని అత్యంత వైభ‌వంగా చాటిచెప్పారు. 

 

ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల‌కు ఇటీవ‌ల పండంటి ఆడబిడ్డ మెగా ప్రిన్సెస్ క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ, కుటుంబ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకునేలా స్టార్ క‌పుల్ పండుగను చేసుకున్న తీరుకు అంద‌రూ ముచ్చ‌ట‌పడుతున్నారు. స్త్రీ శ‌క్తిని ప్ర‌శంసించేలా, ప్రోత్స‌హించేలా, కొనియాడేలా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు ఉపాస‌న చ‌రణ్ దంప‌తులు. మ‌హిళా సాధికారత‌ను అత్యంత అద్భుతంగా కొనియాడే పండుగ ద‌స‌రా. స్త్రీశ‌క్తికున్న ప్రాధాన్యత‌ను న‌వ‌రాత్రుల్లో వ‌ర్ణించే శోభ ఈ పండుగ సొంతం. ఆ స్ఫూర్తిని జ‌నాలకు పంచేలా ఈ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు.

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  దసరా సెలబ్రేషన్స్ ను ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. ఇంట్లోనే ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. తల్లితో కలిసి దసరా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టుదుస్తులు ధరించి పూజలో పాల్గొని హిందూ సంప్రదాయాలను, ఆచారాలను పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక విజయ్ దేవకొండ ప్రస్తుతం పరుశరామ్ పెట్లతో ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరితోనూ VD12లో నటిస్తున్నారు. 

Ram Charan and  Vijay Deverakonda  Dussehra Celebrations NSK

Follow Us:
Download App:
  • android
  • ios