ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై సంవత్సరం పైనే గడచిపోయింది. ఆస్కార్ కూడా కొట్టేసింది. నాటు నాటు సాంగ్ కి అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం ఆగడం లేదు.
ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై సంవత్సరం పైనే గడచిపోయింది. ఆస్కార్ కూడా కొట్టేసింది. నాటు నాటు సాంగ్ కి అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం ఆగడం లేదు. జపాన్ లో కొమరం భీం, రామరాజు ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అంతర్జాతీయంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కొల్లగొట్టింది. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లకి అరుదైన గౌరవం లభించింది. జపాన్ లో అత్యంత పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్, ఎన్టీఆర్ ఫోటోలని ప్రచురించారు. ఆర్ఆర్ఆర్ హీరోలకు దక్కిన అత్యంత అరుదైన గౌరావం ఇది అని చెప్పొచ్చు.
ఈ ఫీట్ సాధించడంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే జపాన్ లో 1 బిలియన్ యెన్ వసూలు చేసింది. ఇప్పటికి ఆర్ఆర్ఆర్ కోసం జపాన్ వాసులు ఎగబడుతున్నారు.
ఆన్ ఆన్ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్.. చరణ్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ తో నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అదే జోరులో ఆస్కార్ ఎగరేసుకుని వచ్చేశారు.
