ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా కారణంగా సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఐసోలేషన్‌కి వెళ్లారు.
కరోనా సునామీలా వెంటాడుతుంది. చిన్నా పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా ఎవరైతే అజాగ్రతగా ఉంటారో వారిని వెంటాడుతుంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా కారణంగా సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఐసోలేషన్‌కి వెళ్లారు. రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన జయరాం.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోబోతున్నారని సమాచారం. కాగా గతంలో ఒకసారి చరణ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
దీంతోపాటు మహేష్ పర్సనల్ స్టయిలీస్ట్ కూడా కరోనా సోకింది. `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్ యూనిట్‌లోని మరికొందరికి కరోనా సోకింది. దీంతో మహేష్ ఇప్పుడు ఐసోలేట్ అయ్యారట. తాజాగా `స్టేసేఫ్ మహేష్ అన్న` అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. షూటింగ్‌ని తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం ముఖ్యం. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుండటం విశేషం. అంతేకాదు అటు రామ్‌చరణ్,ఇటు మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన స్టార్ట్ అయ్యింది.
వీరితోపాటు `రాధేశ్యామ్` టీమ్‌కి, ప్రభాస్ పర్సనల్ మేకప్ మేన్‌కి కరోనా సోకడంతో ఆయన కూడా ఐసోలేట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ రోజు తనకు కరోనా సోకినట్టు హీరో కళ్యాణ్ దేవ్ ప్రకటించారు. అలాగే పవన్ కళ్యాణ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇలా చిత్ర పరిశ్రమని కరోనా ఓ రేంజ్‌లో వెంటాడుతుంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో థియేటర్ల బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే 50శాతం యూనిట్‌తోనే చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకోవాలని ఫిల్మ్ ఛాంబర్స్ సూచించాయి.
