నాటు నాటు సాంగ్‌కి లభించిన క్రేజ్ కారణంగా అభిమానులు డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా  నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - కీర్తి సురేష్ క‌లిసి చేసారు.


ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ ఎప్పుడైతే రిలీజైందో.. అప్పటి నుంచే అభిమానులను ఊపేస్తోంది. నాటు నాటు నాటు... వీర నాటు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అవుతున్నాయి. కోవిడ్ తో మూవీ రిలీజ్ వాయిదా పడినా...ఈ సాంగ్ స్టెప్స్ దాదాపు ప్రతీ రోజు ఎక్కడో చోట కనపడి ఫ్యాన్స్ ని పండుగ చేసుకునేలా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నాటు నాటు సాంగ్ బాగా నచ్చేయటమే అందుకు కారణం.

YouTube video player

ఊర మాస్ స్టైల్లో కీరవాణి కంపోజ్ చేసిన ట్యూన్‌కి తారక్, చెర్రీ (Ntr, Ram Charan) స్టెప్పులేసిన స్టైల్ తెలుగు వారినే కాకుండా ఇతర అన్ని భాషల ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. నాటు నాటు పాటపై అభిమానులు డ్యాన్స్ చేసి #RRRMassAnthem హ్యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటు నాటు సాంగ్‌కి లభించిన క్రేజ్ కారణంగా అభిమానులు డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - కీర్తి సురేష్ క‌లిసి చేసారు.


రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంత‌రం కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.