మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2కి సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే సినిమా ఆడియెన్స్ ని మరింత ఆకర్షించాలంటే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాల్సిందే. 

అందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాంకర్ గా కొత్త అవతారంలో కనిపించనున్నాడట. సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ తో రామ్ చరణ్ స్వయంగా ముచ్చటించనున్నాడట. అందరితో కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ వీడియోలను అన్ని ఛానెల్స్ కి అందిస్తారట. 

చరణ్ యాంకర్ గా మారితే సినిమాపై ఒక్కసారిగా జనల ద్రుష్టి పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే RRR షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చరణ్ కి సమయం దొరకడమే కష్టమే. అయితే రాజమౌళితో ఈ విషయంపై చర్చించి సైరా ప్రమోషన్స్ లో పాల్గొనాలని చరణ్ ఆలోచిస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.