అల్లు అర్జున్ - రామ్ చరణ్ ప్రస్తుతం జనరేషన్ కి ఫ్రెడ్లిగా ఎలా ఉండాలో చేతలతో చూపిస్తున్నారు. బన్నీ చిన్న సినిమాలకైనా సరే ఎప్పుడు తన సపోర్టును అందిస్తుంటాడు. ఇక రామ్ చరణ్ బాబాయ్ బాటలో నడుస్తూ మంచి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఇప్పుడు ఈ మెగా హీరోలు డిసెంబర్ 21న రిలీజ్ కానున్న కుర్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అతిధులుగా వెళ్లనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ పడి పడి లేచే మనసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ వెళుతున్నాడు. ఇక తమ్ముడు వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం 9000 KMPH సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అన్నయ్య రామ్ చరణ్ ముఖ్య అతిధి. 

ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్ లో తెరకెక్కగా వేటికవే ప్రత్యేక అంచనాలను పెంచుతుండగా ఇప్పుడు స్టార్ హీరోల రాకతో మరింతగా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఎక్కువా లాభాలను అందిస్తుందో చూడాలి.