‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్‌గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’ అన్నారు రామ్ చరణ్.
సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులను ఈ చిత్రం దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ చిత్ర యూనిట్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్‌గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’ అన్నారు రామ్ చరణ్.
మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం `మహేశింతే ప్రతీకారమ్` చిత్రాన్ని వెంకటేశ్ మహ తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య` టైటిల్ తో రీమేక్ చేశాడు. ఇక `మహేశింతే ప్రతీకారమ్` ... గత పదేళ్లకాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటి. ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా తీసిన ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా చేసారు.
ఇస్మార్ట్ శంకర్, రాగల 24 గంటల్లో లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. సత్యదేవ్ కంచరన, నరేష్, సుహాస్, జబర్‌దస్త్ రాంప్రసాద్, కరుణాకరణ్, టి.ఎన్.ఆర్, రవీంద్ర విజయ్, కె.రాఘవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బల్, కెమెరా: అప్పు ప్రభాకర్, దర్శకత్వం: వెంకటేశ్ మహ, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వర్క్స్), విజయ ప్రవీణ పరుచూరి(మహాయాణ మోషన్ పిక్చర్స్).