ఇండియన్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ - మధు మంతెన - ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా 1500కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ దశలో ఉన్నాయి. 

అయితే సినిమాలో కీలకమైన రాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అయితే రెండు సార్లు ఈ పాత్ర రామ్ చరణ్ చేయాలనీ నిర్మాతలు అఫర్ చేశారట. కానీ అందుకు రామ్ చరణ్ సిద్ధంగా లేకపోవడంతో మరో స్టార్ కోసం వెతుకుతున్నారు. 

రీసెంట్ గా మరోసారి ఈ ప్రస్తావన రాగ రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. పైగా ప్రస్తుతం రాజమౌళి  మల్టీస్టారర్ RRR సినిమాతో బిజీగా ఉండడంతో డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేని పరిస్థితి అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దంగల్ ఫెమ్ నితేశ్ తివారి - మామ్ దర్శకుడు రవి ఉద్యావర్ ఈ 3D  ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారు.