ధృవ సినిమా షూటింగ్ లో రకుల్ బిజీబిజీ ఆడియో హిట్ టాక్ సంపాదించిన పరేషాన్ సాంగ్ షూటింగ్ పాట షూటిింగ్ లో రకుల్ ప్రీత్ హంగామా
వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే సెంటిమెంట్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తెలుగు సినిమాలో సక్సెస్ అనగానే గుర్తొచ్చే హీరోయిన్ రకుల్. సూపర్ స్టార్ మహేష్‌తో ఒక సినిమా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ధృవ’, సాయిధరమ్ తేజ్‌తో ‘విన్నర్’.. ఇలా మూడు సినిమాల్లో నటిస్తూ ప్రస్థుతం బిజీబిజీగా మారిపోయింది. ఈ మూడు సినిమాలను షిఫ్ట్ వైజ్ పనిచేస్తూ రకుల్ పూర్తి చేస్తోంది.
ప్రస్తుతం రకుల్ ‘ధృవ’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన పరేషానురా అనే పాట షూటింగ్‌తో ఆమె బిజీగా ఉంది. ఆడియోలో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన ఈ పాట షూట్‌తో ధృవ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
డిసెంబర్ 2న విడుదల కానున్న ధృవ సినిమా కోసం టీమ్ ఇప్పట్నుంచే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేసింది. షూట్ మొత్తం పూర్తవ్వగానే రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొననున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
