టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కరోనా నెగటివ్‌ వచ్చింది. మంగళవారం టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నెల 22న రకుల్‌ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయ్యిందని ప్రకటించింది. తనకి పెద్దగా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించింది. ఎవరూ ఆందోళన చెంద వద్దని, తాను మరింత స్ట్రాంగ్‌గా మారతానని వెల్లడించింది. 

తాజాగా తనకు నెగటివ్‌ వచ్చిందని వెల్లడించింది. `కరోనా టెస్ట్ రిజల్ట్ నెగటివ్‌ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. నేనిప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను. అందరి ప్రేమాభిమానాలు, త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలకు థ్యాంక్స్. 2021ను ఆరోగ్యంతో, ఆశావాహ దృక్పథంతో ప్రారంభిస్తాను. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. మాస్కులు కచ్చితంగా ధరించండి, జాగ్రత్తలు తీసుకోండి` అని రకుల్‌ వెల్లడించింది. 

మరోవైపు ప్రస్తుతం వరుసగా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉందట ఈ సెక్సీ బ్యూటీ. ప్రస్తుతం రకుల్‌ తెలుగులో నితిన్‌తో `చెక్‌`, క్రిష్‌-వైష్ణవ్‌ తేజ్‌ సినిమాతోపాటు తమిళంలో కమల్‌తో `ఇండియన్‌ 2`, శివకార్తికేయన్‌తో `అయలన్‌`, హిందీలో అర్జున్‌ కపూర్‌తో `సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌ సన్‌`, జాన్‌ అబ్రహంతో `ఎటాక్‌`, అజయ్‌ దేవగన్‌, బిగ్‌బీలతో `మేడే` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.