సౌత్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ అప్పుడపుడు సమాజసేవలో కూడా పాల్గొంటూ ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహారచడం తన నైజమని చెప్పే ఈ భామ పాలిటిక్స్ వైపు కూడా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

అయితే అప్పుడు వేరే హీరోయిన్స్ ఎక్కువగా హడావుడి చేయడంతో రకుల్ వార్తలను ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మడు నటించిన పొలిటికల్ డ్రామా NGK రిలీజ్ కి సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ లో బిజీగా మారింది. అలాగే పాలిటిక్స్ పై ఊహించని కామెంట్స్ చేశారు. 

ఈ ఎన్నికల్లో డ్రామాలు ఎక్కువగా నడిచాయని లోక్ సభ ఎన్నికల్లో నేతలు కొట్టుకోవడం చూస్తే టీవీ ప్రోగ్రామ్స్ టిఆర్పి కోసం చేసిన హడావుడిలా అనిపించిందని కౌంటర్ ఇచ్చింది. అదే విధంగా తన పొలిటికల్ ఎంట్రీపై ఎదురైనా ప్రశ్నకు అమ్మడు డిఫరెంట్ గా సమాధానమిచ్చింది. 

నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని, సమాజంలో మార్పు తీసుకురావాలని నాలో ఉంది. అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటాను. కానీ రాజకీయాల్లో నేను నడవలేను.. ఒంటరిగానే నా ఆలోచనలతో ముందుగు సాగుతాను రాజకీయాల డ్రామాలకు చాలా దూరంగా ఉంటానని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన వివరణ ఇచ్చింది.