ప్రపంచ యోగా డే సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దంపతులను ప్రత్యేకమైన అవార్డు వరించింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించడంతో పాటు తన స్పందన కూడా తెలియజేసింది. 

ప్రపంచ యోగాడే సదర్భంగా జూన్ 21న ఆరోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరిగాయి. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భాగస్వామితో కలిసి ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు గెలుచుకున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ ప్రత్యేక సందర్భంలో అలాంటి గౌరవం రావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, “ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.ఫిట్‌నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్‌లు, స్పెషల్ పరికరాలు అవసరం లేదు. ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు లేకుండానే ఇంట్లోనే యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యోగా ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ఇది శారీరకమే కాక మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది” అని స్పష్టం చేశారు.

Scroll to load tweet…

రకుల్ ఈ సందర్భంగా ప్రజలకు యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాక, యోగా ప్రాముఖ్యతను గుర్తించి అవార్డుల రూపంలో గుర్తింపు ఇవ్వడాన్ని సంతోషంగా స్వీకరించారు. ఈ అవార్డు ద్వారా యోగా సాధనకు ప్రోత్సాహం మరింతగా పెరుగుతుందని రకుల్ అభిప్రాయపడ్డారు. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి యూత్ కు మంచి మార్గదర్శనంగా నిలుస్తాయని, యోగా పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ అవార్డులు అందిస్తున్నారు. . రకుల్ ప్రీత్ సింగ్, తన భాగస్వామితో కలిసి ఫిట్‌నెస్ తో పాటు, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అనుసరిస్తూ.. చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాంతో ప్రభుత్వం వీరిని గుర్తించి అవార్డ్ ప్రకటించింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడంలేదు. బాలీవుడ్ వైపు వెళ్ళినా అక్కడ కూడా అవకాశాలు రాలేదు రకుల్ కు. తమిళంలో ఆమె నటించిన ఇండియాన్ 2మూవీ డిజాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం ఆమె ఫ్యామిలీకి టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది.