రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. బాలీవుడ్ లో రకుల్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. అజయ్ దేవగన్, టబు, రకుల్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. ప్రస్తుతం రకుల్ సూర్య చిత్రం ఎన్జీకే, నాగార్జున సరసన మన్మథుడు 2లో నటిస్తోంది. 

ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది. తనకు కాబోయే భర్తకు 3 క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలట. మొదటి క్వాలిటీ పొడవు. తనకు కాబోయే భర్త తప్పనిసరిగా 6 అడుగుల పొడవు ఉండాలంటోంది రకుల్. తాను హై హీల్స్ వేసుకుని నిలబడ్డా తన భర్తే పొడవుగా కనిపించాలని అంటోంది. 

రెండవ క్వాలిటీ గురించి మాట్లాడుతూ.. అతడికి జీవితం పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. అందరిలా ఏదో ఒక వృత్తిలో కొనసాగుతూ రొటీన్ లైఫ్ గడపకూడదు. ఓ ఆశయంతో, విజన్ తో పనిచేసే వ్యక్తి అయి ఉండాలని రకుల్ అంటోంది. మూడవ క్వాలిటీ గురించి మాట్లాడుతూ.. అతడు నిజాయతీగా ఉండాలి.. అలాగే హాస్య చతురత కలిగి ఉండాలి అని రకుల్ అంటోంది. 

దే దే ప్యార్ దే చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ కు ప్రియురాలిగా నటించింది. అజయ్ దేవగన్ భార్య నుంచి విడిపోయిన 50 ఏళ్ల వ్యక్తిగా నటించాడు.