హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు గడుస్తోంది. అలాగే అన్ని దాదాపు 40 సినిమాల్లో నటించింది రకుల్. 

తాజాగా ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ తన మనసులో మాట బయట పెట్టింది. సాధారణంగా హీరోయిన్లు వెండితెరపై రొమాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారు. కానీ గ్లామర్ ఫీల్డ్ కనుక గుర్తింపు కోసం సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. రకుల్ చాలా కమర్షియల్ చిత్రాల్లో నటించింది. 

కానీ ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మనసు ప్రేమ, రొమాంటిక్ చిత్రాలపై పడిందట. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా తెలిపింది. సౌత్ లో నేను అనేది జోనర్ ఫిలిమ్స్ చేశాను. కానీ పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ చేయలేదు. ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లుగా రొమాన్స్, లవ్ తో ఉండే సినిమాలు చేయాలని ఉంది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి కథలు కావాలి అని రకుల్ తెలిపింది. అలాగే బయోపిక్ చిత్రాల్లో కూడా నటించాలని ఉన్నట్లు రకుల్ పేర్కొంది. కమర్షియల్ చిత్రాలు రకుల్ బోర్ కొట్టాయేమో. 

ప్రస్తుతం రకుల్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ రియల్ లైఫ్ లో కూడా రొమాన్స్ , ప్రేమ మొదలయింది. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ.