మొదటి నుంచి రకుల్ ప్రీత్ కమర్షియల్  బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. తన సంపాదనని పెట్టుబడులు పెట్టడంలో ముందుంటోంది. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తూంటుంది. ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు అనిపించుకుంది.

ఇదే ఊపులో రకుల్ ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారారు. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.  రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ఆమె ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఖరారు చేస్తూ  ట్వీట్ చేయడం జరిగింది. దీంతో  ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ తన జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేయనున్నారన్న అని అర్దమవుతోంది.  

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ఈ మధ్యన కాస్తంత తగ్గింది.ఈ మధ్యే విడుదలైన మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్‌కు తెలుగులో పెద్ద దెబ్బే పడింది. దాంతో ఆఫర్స్  వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తోంది రకుల్. ఏదిఏమైనా రకుల్ అటు సినీ రంగంలో రాణిస్తూనే మరలా ఇలా టెన్నిస్ జట్టు ప్రాంచైజీలా మారి తన ప్రత్యేకతను చాటుకోవటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.