ఆ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్!

rakul preet singh special request to balakrishna for role in ntr biopic
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతోందట. ఇంతకీ విషయమేమిటంటే.. దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ బాగా వస్తుందని తెలుసుకున్న రకుల్ సినిమాలో నటించాలని ఆశ పడుతోందట. 

దీంతో ఇటీవల బాలకృష్ణను కలిసిన సందర్భంలో సినిమాలో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిందట. చిన్న పాత్ర అయినా సరే నో చెప్పనని ఎలాగోలా సినిమాలో ఛాన్స్ ఇప్పించమని అడిగినట్లు సమాచారం. దీంతో బాలకృష్ణ కూడా ఓకే అని చెప్పారట. దీంతో సినిమాలో తనకు కచ్చితంగా ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో ఉంది ఈ బ్యూటీ. ఎన్టీఅర్ జీవితంలో సినిమాలు కీలకపాత్ర పోషించాయి. 

స్క్రిప్ట్ లో కచ్చితంగా సినిమాల ప్రస్తావన ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్లుగా ఎన్టీఅర్ తో కలిసి పని చేసిన అప్పటి హీరోయిన్లను కూడా చూపించే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో అలనాటి కథానాయికల పాత్రల్లో రకుల్ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి రకుల్ కు ఎలాంటి పాత్ర దొరుకుతుందో చూడాలి!  

loader