టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. గ్లామర్ తో ఆకట్టుకుంటూనే వెండితెరపై చలాకి నటనతో మెప్పించే ప్రతిభ రకుల్ సొంతం. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, సరైనోడు, ధృవ,పండగ చేస్కో, స్పైడర్, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో నటించింది. 

ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కు వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో ఆమె జోరు కాస్త తగ్గింది. రకుల్ ప్రీత్ సింగ్ ఆఫ్ స్క్రీన్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. శనివారం రోజు విశాఖలో జరిగిన 555కె 2.0 వాక్ ముగింపు కార్యక్రమంలో రకుల్ ముఖ్య అతిథిగా పాల్గొంది. 

ఈ సందర్భంగా రకుల్ మహిళల భద్రత కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలు ముందుగానే అత్యాచార ప్రమాదాల్ని పసిగట్టగలగాలి. ఆవిధంగా వారికీ శిక్షణ ఇప్పించాలి అని రకుల్ పేర్కొంది. ఇలా చేస్తే కొంత మేరకైనా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల్ని అరికట్టే అవకాశం ఉంటుందని రకుల్ పేర్కొంది. 

కొంతమంది అమ్మాయిలని లైంగికంగా ప్రేరేపించేందుకు అసభ్యంగా తాకుతుంటారు. కొంతమంది అసభ్యంగా తాకుతుంటారు. వారు తేడాగాళ్ళు అని ముందే పసిగట్టగలగాలి. ఫిర్యాదు చేయాలి అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 

ఈ సందర్భంగా ఓ సంఘటనని రకుల్ ఉదాహరణగా పేర్కొంది. ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినికి చాక్లెట్ ఇస్తూ అసభ్యంగా తాకేవాడు. అతడి ఉద్దేశాన్ని ఆ అమ్మాయి గ్రహించి ఫిర్యాదు చేసింది అని రకుల్ తెలిపింది. తల్లి స్పర్శకు, అతడి స్పర్శకు ఉన్న తేడాని ఆ అమ్మాయి గ్రహించింది అని రకుల్ తెలిపింది. 

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ధూం ధాం.. బాలయ్య సహా వారంతా రచ్చ!

తనని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రకుల్ ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ సరసన ఓ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.