మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం చిరంజీవి తన 152వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రూపొందించనున్నాయి. 

ఇదిలా ఉండగా చిరు ఫ్యామిలీ రీసెంట్ గా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంట్లో శనివారం రోజు గ్రాండ్ గా పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే 80 వ దశకంలో దక్షణాది హీరోలు, హీరోయిన్లు గెట్ టుగెదర్ పార్టీని ప్లాన్ చేసుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి వీరంతా గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

ఈసారి పార్టీని తన నివాసంలో ఏర్పాటు చేస్తానని చిరంజీవి ముందుకు వచ్చారట. ఆ మేరకు నెలరోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే చిరంజీవి కొత్త నివాసానికి సంబంధించిన గృహప్రవేశ కార్యక్రమం కూడా కలసి వచ్చింది. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. 80 దశకంలోని నటులంతా ప్లాం చేసుకున్న ప్రకారం బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ లలో పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఈ సింగర్స్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.. కారణం ఇదే!

గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో 80 దశకంలో నటులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రమేష్ అరవింద్, సుమన్, జయరామ్, ఖుష్బూ, రాధ, రాధిక, అంబిక, ప్రియదర్శన్, సుమలత లాంటి నటులంతా పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఈ పార్టీకి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరైనట్లు స్పష్టత లేదు. కొన్ని కారణాల రీత్యా రజని ఈ పార్టీకి హాజరు కాలేకపోయారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో విందుతో పాటు కొన్ని సరదా గేమ్స్ కూడా జరిగాయట. కఠినమైన నిబంధనల నడుముపై ప్రైవేట్ కార్యక్రమంగా ఈ గెట్ టుగెదర్ జరిగింది. చివరకు నటుల కుటుంబ సభ్యులని కూడా అనుమంతించకుండా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 40 మంది నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.