అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకుందో.. లేక నిజంగానే పాత్ర నచ్చి ఒప్పుకుందో తెలియదు కానీ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వెండితెరపై నాగార్జునతో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది.

'వెంకీ మామ' సినిమాలో చైతు పక్కన నటించమని అడిగితే తన పాత్ర నిడివి తక్కువ ఉందని బయటకి వచ్చేసిన రకుల్ ఇప్పుడు సీనియర్ హీరోతో సినిమా చేయడానికి అంగీకరించి అందరికీ షాక్ ఇచ్చింది.

నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ 'మన్మధుడు 2' సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా నాగార్జున భార్య పాత్రలో రకుల్ ని తీసుకున్నట్లు సమాచారం. అరవై ఏళ్ల హీరో పక్కన నటించడమే సాహసం అనుకుంటే.. ఆ హీరో భార్య క్యారెక్టర్ ఓకే చెప్పింది రకుల్.

ఇంత రిస్క్ అవసరమా..? అని అడుగుతోన్న సన్నిహితులకు మాత్రం కథ చాలా బాగుందని, దర్శకుడు రాహుల్ తన పాత్రను అధ్బుతంగా డిజైన్ చేశాడని చెబుతోందట. నాగార్జున సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరపనున్నారని తెలుస్తోంది.