నాని సినిమాలో రకుల్ ఐటెం సాంగ్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. కానీ తమిళ, హిందీ భాషల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వస్తున్నాయి.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. కానీ తమిళ, హిందీ భాషల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా త్వరలోనే రకుల్ ఐటెం సాంగ్ లో కనిపించనుందని సమాచారం. నాని హీరోగా దర్శకుడు విక్రం కుమార్ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ అనే మలయాళీ హీరోయిన్ ని తీసుకున్నట్లు సమాచారం. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. దానికోసం దర్శకనిర్మాతలు స్టార్ హీరోయిన్ రకుల్ ని సంప్రదించినట్లు సమాచారం.
అయితే దీనికి ఆమె అంగీకరించిందా..? లేదా...? అనే విషయంలో ఇంకా స్పష్టం రాలేదు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.