చాలా కాలంగా రకుల్ ప్రీతి సింగ్ సరైన హిట్ కోసం చూస్తోంది. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన చిత్రాలు ఏమీ ఆడకపోవటంతో ఆమె కెరీర్ లో వెనకబడింది. ముఖ్యంగా తెలుగులో స్పైడర్ సినిమా తర్వాత ఆమె జోరు తగ్గిపోయింది. ఈ నేఫధ్యంలో ఆమె హిందీలో బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దే దే ప్యార్‌దే’సినిమా చేసింది. అకీవ్‌ అలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ వచ్చి రకుల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. 

ఈ చిత్రంలో రుకల్ ... ఆయేషా అనే పాత్ర పోషించారు.  కథ ప్రకారం.. ఆశిష్‌ మెహ్రా (అజయ్‌ దేవగణ్‌) తన భార్య మంజు (టబు)తో 18 ఏళ్ల క్రితమే విడిపోయి వేరుగా ఉంటాడు. అతనికి పాతికేళ్ల వయసుండే కూతురు, 20 ఏళ్ల  కొడుకు  ఉంటారు.  ఈ క్రమంలో  తన కూతురు వయసుండే అయేషా ఖురానా (రకుల్‌)తో ప్రేమలో పడతాడు ఆశిష్‌. 

ఆమెను తన ఫ్యామిలీకు ఇంట్రడ్యూస్ చేసేందుకు ఇంటికి తీసుకొస్తాడు. అయితే తన మాజీ భార్య, పిల్లలు అయేషాను అస్సలు అంగీకరించక పోవటం... వాటి నుంచి వచ్చే ఫన్ సినిమాకు కలిసొచ్చింది.  అయేషాను పెళ్లి చేసుకోవాలంటే వాళ్లందరినీ ఒప్పించాల్సిన పరిస్థితి. దానికోసం ఆశిష్‌ చేసే పనులు నవ్వించాయి.

2017లో విడుద‌లైన గోల్‌మాల్ ఎగైన్ చిత్రం నేప‌థ్యంలోనే దేదే ప్యార్ దే చిత్రం ఉంది. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ రోజు (మే 17న )ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.