థాయిలాండ్ లో రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ పార్టీ.. టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే జాకీ భగ్నానీ, రకుల్ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.
ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ తన బ్యాచిలర్ పార్టీ కోసం థాయ్ లాండ్ వెళ్ళింది. తనకి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. టాలీవుడ్ లో వీళ్ళిద్దరూ రకుల్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.