టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోలందరితోనూ రకుల్ ఆడిపాడింది. కాగా.. రకుల్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అందరికీ తెలుసు.

ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్  కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఎంత ఫిట్నెస్ గా ఉన్నప్పటికీ.. ఓ రెండు ఆహారాల విషయంలో మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేనంటూ రకుల్ ఓ సీక్రెట్ రివీల్ చేశారు.

ఫిట్‌గా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నచ్చినా కూడా నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. కానీ రకుల్‌కి మాత్రం రెండు ఐటమ్స్‌ అంటే నోరూరుతుందట. అవేంటంటే ఆలూ పరాటా, గులాబ్‌ జామున్‌. ఈ రెండు ఫుడ్‌ ఐటమ్స్‌ విషయాల్లో కంట్రోల్డ్‌గా ఉండటం తన వల్ల కాదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. డైట్‌ అంటూ వీటికి దూరం కావడం నా వల్ల కాదంటారామె. అందుకే ఆలూ పరాటా, గులాబ్‌ జామున్‌ లాగించేసి, ఆ కేలరీలను జిమ్‌లో కరిగించేస్తా అంటున్నారు రకుల్‌.