కుర్ర హీరోలకు నో చెప్తున్న రకుల్ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పంజాబీ భామ తమిళంలో ప్రస్థుతం సూర్య, కార్తీలతో నటిస్తున్న రకుల్

ప్రస్తుతం రకుల్‌ చేతిలో తెలుగు సినిమాలు లేవనీ, రకుల్‌ పని అయిపోయిందనీ ఇలా చాలా వార్తలు ఇటీవల హల్‌చల్‌ చేశాయి. అయితే అవన్నీ అబద్ధం అని తేలిపోయింది. రకుల్‌ భారీ బడ్జెట్‌ లేదా పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఒప్పుకుంటోందట. చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలకు రకుల్ ససేమిరా అంటోందట! దీనికి కారణం లేకపోలేదు.

టాలీవుడ్‌లో మెగా హీరోలందరితో సినిమాలు చేసిన రకుల్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో సూర్య, కార్తీలపై పడింది. తమిళంలో కార్తీతో ఓ భారీ బడ్జెట్‌ సినిమా చేస్తోంది రకుల్. అలాగే సూర్యతో కూడా ఓ సినిమాకి ఓకే చెప్పింది. ఈ రెండింటిలో ఏ సినిమా హిట్టయినా రకుల్‌ కోలీవుడ్‌లో జెండా పాతడం ఖాయం అంటున్నారు.

కోలీవుడ్‌లో ఇద్దరు పెద్ద హీరోలతో చేస్తోంది కనుకే ఎక్కడా చిన్న హీరోల సినిమాలకి ఓకే చెప్పడం లేదనీ,.. డేట్లు లేవనీ తప్పించుకుంటోందనీ,.. పెద్ద హీరోలకు డేట్లు ఇస్తుంది కానీ చిన్న హీరోలకు మాత్రం డేట్లు కుదరట్లేదని తప్పించుకుంటోందట! మొత్తానికి రకుల్‌ ప్లాన్ మామూలుగా లేదని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.