ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్న రకుల్ హిట్ హీరోయిన్ టాక్-తో ఫీజు పెంచిన బ్యూటీ వరుసగా హిట్లు కొడుతుండటంతో రోజ్ బ్యూటీకి డిమాండ్ రేటు పెంచినా ఓకే అంటున్న నిర్మాతలు
వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్.. ఇండస్ట్రీలో లక్కీ గాళ్ గా పేరు తెచ్చుకుంది. దీంతో హిట్టు కోసం సెంటిమెంటును నమ్మే నిర్మాతలు, హీరోలు రకుల్ వెంట పడుతున్నారు. ప్రస్థుతం రకుల్ కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంంటోంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటిస్తున్న రకుల్... ఇప్పుడు తన రెమ్యునరేషన్ కోటి నుంచి కోటిన్నరకు పెంచేసిందట.
రకుల్ రెమ్యునరేషన్ పెంచినా ఆశ్చర్యకరంగా నిర్మాతలు సైతం ఎలాంటి అభ్యంతరం లేకుండా రకుల్్ డేట్స్ అడుగుతున్నారట. సెంటిమెంటును నమ్మే మన నిర్మాతలకు రకుల్ లాంటి గులాబ్ జామూన్ వదలాలంటే మనసు ఎలా ఒప్పుతుంది... అందుకే రేటు ఎక్కువైనా ఫర్వాలేదంటూ రకుల్ ప్రీత్ సింగ్-ను డేట్స్ అడుగుతున్నారు. ఇంకేం రకుల్ ఇంకా కొంత కాలం కాసుల పంట పండించుకోవడం ఖాయం.
