సోషల్ మీడియాలో స్టార్స్ కు చేదు అనుభవాలు ఎదురవ్వడం కామన్ గా మారింది. ఎన్ని సార్లు స్పందించినా కూడా రూమర్స్ ఆగవని వాటిని పట్టించుకోవడం మానేస్తారు. అయితే కొన్నిసార్లు డోస్ పెరిగితే స్పందించక తప్పదు. అదే విధంగా రీసెంట్ గా రకుల్ కూడా స్పందించక తప్పలేదు. 

కాకపోతే రకుల్ అందరిలాగా జవాబు ఇవ్వకుండా కౌంటర్ ఎటాక్ చేసింది. గత కొంత కాలంగా బేబీ పోస్ట్ చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొందరు ట్రోల్ చేస్తూ అమ్మడిని హేళన చేస్తూ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ని తాను ఎంతమాత్రం పట్టించుకోనని బేబీ ఆన్సర్ ఇస్తోంది. 

పని పాట లేని వారు చాలా మంది విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు/ అలాంటి వారు చేసే కామెంట్స్ ని అస్సలు లెక్క చేయను. స్నేహితులు - నా తల్లిదండ్రులు  ఏమంటున్నారన్నదే నాకు ముఖ్యం. అయినా నేను ఎంతో మందికి నచ్చుతాను అలాగే కొంతమందికి నచ్చను. అందరిని సంతృపిపరిచే శక్తి నా వద్ద లేదు' అంటూ రకుల్ వివరణ ఇచ్చింది.