తెలుగు అంటే చాలా ఇష్ట‌మంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్. తెలుగు అమ్మాయిలా మారాను అని చెబుతుంది. త‌న ఇష్టాన్ని బ‌య‌ట‌కి చెప్పిన వ‌య్యారి భామ‌.  

‘నేను పంజాబీనే.. అయినా తెలుగుమ్మాయిలా వుండాలనుకుంటున్నాను.. ఎప్పటికీ..’ అంటూ ముద్దు ముద్దుగా ‘ధృవ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలుగులో మాట్లాడేసింది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లు, తెలుగు నేర్చుకోవడంలో అంతగా ఇష్టం చూపించరు ఇప్పటికీ. అయితే, గతంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్‌. నిజమే, రకుల్‌ మాట్లాడేటప్పుడు తన మాటల్లో ఎక్కడా ఇంగ్లీషు దొర్లకుండా జాగ్రత్తపడ్తుంది. తెలుగుకి ఇంత గౌరవమిస్తున్న రకుల్‌కి హ‌ట్సాఫ్‌ ..!