టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మొన్నటివరకు బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవకాశాలను అంతగా అందుకోవడం లేదు. వరుస సినిమాలు ప్లాప్ అవుతుండడంతో అమ్మడిని ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఆమె ఫ్యామిలీ నుంచి ఒక కథానాయకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. 

రకుల్ గత కొంత కాలంగా తన తమ్ముడు అమన్ ను సినీ వరల్డ్ కు పరిచయం చేయాలనీ అనుకుంటోంది. సరైన కథ కోసం ఎదురుచూసిన ఈ హీరోయిన్ రీసెంట్ గా ఒక మంచి కథను అమన్ కి సెట్ చేసింది. రెండేళ్ల క్రితం నాగశౌర్య హీరోగా నీ జతలేక అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా దాసరి లారెన్స్ రకుల్ తమ్ముడిని డైరెక్ట్ చేయనున్నారు. 

ఫిబ్రవరి 24న సినిమాను హైదరాబాద్ లో గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదివరకే బాలీవుడ్ లో అమన్ ఒక సినిమాను స్టార్ట్  చేశాడు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ ద్విభాషా చిత్రం ఈ ఏడాది చివరలో రానుందని సమాచారం.