Asianet News TeluguAsianet News Telugu

భర్తను అరెస్ట్ చేయించిన రాఖీ సావంత్ 

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన  భర్త ఆదిల్ ఖాన్ ని అరెస్ట్ చేయించారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. 

rakhi sawant conforms her husbad was arrested by police on her complaint
Author
First Published Feb 8, 2023, 4:31 PM IST

కొన్ని రోజులుగా రాఖీ సావంత్-ఆదిల్ ఖాన్ మధ్య వివాదం నడుస్తుంది. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న భర్త ఆదిల్ ఖాన్ తనను మోసం చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. తను అనే అమ్మాయితో ఆదిల్ తిరుగుతున్నాడు. తనను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాడు. తన వద్ద ఉన్న డబ్బులు కూడా ఆదిల్ లాగేసుకున్నాడనేవి రాఖీ సావంత్ ప్రధాన ఆరోపణలు. తాజాగా ఆదిల్ ఖాన్ పై రాఖీ సావంత్ కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ఆమె కంప్లైంట్ ఆధారంగా ఓషివారా స్టేషన్ పోలీసులు ఆదిల్ ఖాన్ ని అరెస్ట్ చేశారట. నేడు ఉదయం ఆదిల్ ఖాన్ అరెస్ట్ చేసినట్లున్న రాఖీ సావంత్ మీడియాకు వెల్లడించారు. ఆదిల్ అరెస్ట్ కి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  చక్కర్లు కొడుతున్నాయి. అరెస్ట్ అనంతరం ఆదిల్ ఖాన్ ని అంధేరి కోర్టుకి తరలించినట్లు సమాచారం.

గత ఏడాది రాఖీ సావంత్ నటుడు ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. రాఖీ సావంత్ కి ఇది రెండో వివాహం. ఆదిత్ తో ఆమె వివాహం బంధం మొదలై సంవత్సరం కాకుండానే వివాదాలు తలెత్తాయి. ఇటీవల మీడియా ముందు ఆదిల్ మీద ఆమె ఫైర్ అయ్యారు. ఆదిల్ పెద్ద అబద్దాల కోరు. ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. నాకు తెలిసి నిలదీస్తే ఇకపై ఆమెతో మాట్లాడను. నంబర్ బ్లాక్ చేస్తున్నానని చెప్పాడు. ఖురాన్ మీద ఓట్టేసి ఆ అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడు. కానీ తన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. ఇంకా తనతో ఎఫైర్ నడుపుతున్నాడు. 

ఆ అమ్మాయి ఆదిల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఇతని ఛండాలపు వీడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని ఆదిల్ ని భయపెడుతుంది. అతను మీడియా అటెన్షన్ కోరుకుంటున్నాడు. ఈ వివాదాలతో పాప్యులర్ కావాలనుకుంటున్నాడు. దయచేసి ఆదిల్ ఖాన్ ని మీడియా వాళ్ళు ఎవరూ ఇంటర్వ్యూ చేయవద్దు... అంటూ రాఖీ ఆవేదన చెందారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telly Talk (@tellytalkindia)

రాఖీ సావంత్ మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ఈసారి ఆదిల్ తో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్న అమ్మాయి పేరు రాఖీ సావంత్ బయటపెట్టారు. ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చారు. రాఖీ ఆరోపణల ప్రకారం తను అనే అమ్మాయి ఆదిల్ తో ఎఫైర్ నడుపుతుంది. ''తను నువ్వు నా భర్తను నా నుండి లాక్కున్నావు. నాలాగే నువ్వు కూడా బాధపడే రోజు వస్తుంది. అది నేను చూడాలనుకుంటున్నాను. ఆదిల్ తో ఒక ఏడాది పాటు జర్నీ చేసిన అమ్మాయిగా చెబుతున్నా నీకు బాధలు తప్పవు. నువ్వు నన్ను తిట్టిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి'' అని రాఖీ సావంత్ అన్నారు. ''నేను కష్టపడి పరిశ్రమలో ఎదిగాను. నా డబ్బులు మొత్తం ఆదిల్ లాగేసుకున్నాడు. మానసికంగా, శారీరకంగా నన్ను వేధించాడని'' ఆదిల్ మీద ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఆదిల్ తో రాఖీ సావంత్ బంధం ముగిసినట్లనిపిస్తుంది. రాఖీ సావంత్ బాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా పాపులర్ అయ్యారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telly Talk (@tellytalkindia)

Follow Us:
Download App:
  • android
  • ios