కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మేకర్స్ ‘కేజీఎఫ్ వర్స్’ పేరిట యష్ డిజిటల్ అవతార్ ను రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో విక్రయాలు జరుపుతోంది.
ఆడియెన్స్ ఎదురుచూస్తున్న మెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ KGF Chapter 2. నాలుగేండ్ల కింద కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’కి ఇది సీక్వెల్. రాఖీ భాయ్ పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించారు. హుంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. చాప్టర్ 2 ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా నిర్మాతలు `కెజిఎఫ్‌వర్స్` పేరిట యష్ డిజిటల్ అవతార్ ను పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ కేజీఎఫ్ వర్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ డిజిటల్ ట్రైలర్ తక్కువ సమయంలో గరిష్ట వీక్షణలతో రికార్డును సృష్టించింది. ఈ కారణంగా `KGF` ఫ్రాంచైజీ దేశంలో ఇప్పుడు భారతదేశంలో 1000 NFT టోకెన్‌లను అత్యంత వేగంగా విక్రయించింది. అయితే ఈ `KGF verse`ను అభిమానుల కోసం రూపొందించారు. అయితే భవిష్యత్ లో కేజీఎఫ్ ఫ్రాంచైజీ లను వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లు మరియు గేమ్‌లకు యాడ్ చేసే అవకాశం ఉంది.
ఈ కేజీఎఫ్ వర్స్ చాలా ఆకట్టుకుంటోంది. మొదట ఎల్-డొరాడో (KGF ఫ్రాంచైజీ ఆధారంగా ఉన్న పుస్తకం)తో స్టార్ అవుతుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 యష్ పాత్ర తాలుకూ కొన్ని ఫొటోలను డిజిటల్ అవతార్ రూపంలో మార్చారు మేకర్స్. దీన్ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కేజీఎఫ్ చాఫ్టర్ 1 రిలీజ్ అయి ఇప్పటికే మూడేండ్లు గడిచిపోయింది. దీంతో ప్రేక్షకులకు సినిమాలోని కొన్ని ప్రముఖ సీన్లను గుర్తు చేసేలా ఈ కేజీఎఫ్ వర్స్ కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో చిత్రం విడుదల కానుంది.
