ఎంతో ప్రతిష్టాత్మకమైన మహాభారతంను తెరపైకి తేవాలంటే చాలా కష్టమైన పని అని అందరికి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మహా సముద్రమంత కథను రెండు గంటల్లో చూపించడం అంత సాధారణమైన విషయం కాదు. 

అయితే దర్శకుడు రాజమౌళి ప్రతిసారి పదేళ్ల తరువాత ఆ సినిమా గురించి ఆలోచిస్తానని చెబుతుండగా ఓ బాలీవుడ్ డైరక్టర్ మాత్రం సినిమాను దాదాపు సెట్స్ పైకి తేవడానికి సిద్దమయ్యాడు.అతనెవరో కాదు.. అమిర్ ఖాన్ తో రంగ్ దే బసంతి వంటి హిట్ సినిమాను తీసిన రాకేష్ ఓం ప్రకాష్ ఈ అద్భుత కావ్యాన్ని సెట్ చేసుకున్నాడు. 

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను ఎండ్ చేసే పనిలో ఉన్నాడు. మరో వైపు బాలీవుడ్ లో అమిర్ ఖాన్ కూడా మహాభారతం కథలో నటించడానికి సిద్దమయ్యాడు. సినిమాగా తెరకెక్కించడం సాధ్యం కాదని వెబ్ సిరీస్ ఫార్మాట్ లో వెళుతున్నాడు. అయితే ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉంది. ఓమ్ ప్రకాష్ మాత్రం త్వరత్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకొని షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.