ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలు, టీవీ షోలతో చాలా బిజీగా గడుపుతున్నాడు ఈ కొరియోగ్రాఫర్. అయితే తనకు లైఫ్ ఇచ్చిన గురువు రాకేశ్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ కి ఉన్న గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ని తన గురువు గురించి ప్రశిస్తే.. కాసేపటి వరకు ఆయన స్పందించకుండా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే శేఖర్ తో తనకు విబేధాలు ఉన్న సంగతి నిజమేనని అంటున్నాడు రాకేశ్ మాస్టర్. శేఖర్ తనకు తెలియకుండా ఏం చేసేవాడు కాదని.. కానీ పరిస్థితులు మారుతూ వచ్చాయని అన్నారు. ఎదిగే బిడ్డను(శేఖర్ మాస్టర్)నాశనం చేయొద్దని కొందరు తనకు కామెంట్స్ పెడుతున్నారని రాకేశ్ మాస్టర్ అన్నారు.

అసలు శేఖర్ తో తనకు ఏ విషయంలో గొడవ వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ.. కొన్ని పరిస్థితుల్లో శేఖర్ తనను అవమానించిన విషయాలను చెప్పుకొచ్చాడు. ''శేఖర్ పెళ్లి విషయంలో నేనెంతో చేశాను. తన పెళ్లి సమయానికి నేను రాజమండ్రిలో షూటింగ్ లో బిజీగా ఉన్నాను. కానీ.. నా తమ్ముడు పెళ్లి అని చెప్పి షూటింగ్ నుండి కారు వేసుకొని నా అసిస్టెంట్స్ కొందరిని వెంటపెట్టుకొని పెళ్లికి వెళ్లాను. పెళ్లిలో ఏదో గొడవ అయిందని శేఖర్ మాస్టర్ ఏడ్చాడు.. అది చూసిన నేను తట్టుకోలేక తన దగ్గరకి వెళ్తే.. నన్ను పక్కకు నెట్టేశాడు.. ఆరోజు నేను చాలా బాధ పడ్డాను.. ప్రతీది షేర్ చేసుకునేవాడు.. కానీ ఏదీ చెప్పాలనుకోలేదు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురయ్యాయని ఆ కారణంగానే శేఖర్ తో మాట్లాడడం లేదని'' అన్నారు.

చిరంజీవి గారికి సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందని శేఖర్ తనకు చెప్పలేదని ఈ విషయంలో కూడా చాలా బాధ పడినట్లు చెప్పారు. తను వచ్చిన ఆఫర్స్ కూడా కొన్ని శేఖర్ కి ఇప్పించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇంకెప్పుడు పొరపాటున కూడా శేఖర్ ని కలవను అని స్పష్టం చేశారు.