జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. యంగ్ హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా.. అమ్మడి రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన కెరీర్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే రాజుగారి గది 3 అఫర్ ఈ చందమామను వరించినట్లు టాక్ వస్తోంది. 

దర్శకుడు ఓంకార్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న రాజుగారి గది 3 ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ స్పీడ్ పెంచుతున్నారు అనుకునే లోపే మిల్కీ బ్యూటీ తమన్నా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక చిత్ర యూనిట్ తాప్సిని ఫైనల్ చేసినట్లు మరో టాక్ వచ్చింది. 

అయితే ఇప్పుడు వారెవరు కాదని కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు హారర్ కాన్సెప్ట్ తో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొని కాజల్ ఈ సినిమాతో మెప్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే వరకు నమ్మలేము. చూద్దాం రాజుగారి గదిలోకి ఎవరు వెళతారో..?