'రాజుగాడు' ట్రైలర్ టాక్!
యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ కు స్పెషల్ క్రేజ్ ఉండేది. తనదైన నటనతో ఆడియన్స్ ను మెప్పించేవాడు. కానీ మధ్యలో వేసిన కొన్ని రాంగ్ స్టెప్స్ కారణంగా తన ఇమేజ్ కు కొంత 
డ్యామేజ్ కలిగింది. వరుస సినిమాలు చేయడం అందులో కంటెంట్ లేకపోవడంతో అన్ని నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది 'రంగులరాట్నం' అంటూ ఎమోషనల్ డ్రామా ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ హీరో 'రాజుగాడు' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో క్లెప్టోమేనియాతో బాధపడే అబ్బాయిగా రాజ్ తరుణ్ నటించాడు. ఈ వ్యాధి గలవారు అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనాలు చేస్తుంటారు. కొడుకు చేసే దొంగతనాలతో విసిగిపోయిన తండ్రిగా రాజేంద్రప్రసాద్, కొడుకుని సపోర్ట్ చేసే తల్లి క్యారెక్టర్ సితార కనిపించారు. హీరోయిన్ తో ప్రేమ, ఓ సన్నివేశంలో సీమ బ్యాక్ డ్రాప్ తో ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. ఈ చిత్రంతో సంజనా రెడ్డి 
అనే దర్శకురాలు టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరి సినిమా ఆమెకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి!