సౌత్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న రాజు సుందరం పదేళ్ల క్రితం అజిత్ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ ఇంతకాలానికి యంగ్ హీరో శర్వానంద్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. 

శర్వా నటించిన 'రన్ రాజా రన్' సినిమాలో రాజు సుందరం 'బుజ్జి మా' అనే పాటకి కొరియోగ్రఫీ చేశారు. అప్పటినుండే శర్వాతో రాజు సుందరంకి మంచి బాండ్ ఏర్పడింది. ఇటీవల శర్వా కోసం ఓ కథ అనుకొని ఆయనకి వినిపించినట్లు తెలుస్తోంది. శర్వాకి కథ నచ్చడంతో రాజు సుందరం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఈ ఏడాదిలోనే సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అనీల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోపక్క ఈ హీరో '96' సినిమా రీమేక్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తరువాత రాజు సుందరం సినిమాను మొదలుపెట్టనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.