విజయ్ ను ఫాలో అవ్వబోతున్న రజనీ కాంత్, అంతా నెల్సన్ దిలీప్ ప్లానింగ్
విజయ్ సినిమాకు వాడిన ఫార్ములానే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు వాడబోతున్నాడట నెల్సన్ దిలీప్. ఇంతకీ విజయ్ సినిమాకు.. రజనీకాంత్ సినిమాకు సంబంధం ఏంటి..? ఏంటా ఫార్ములా..?
నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి.. వాటిని గమనిస్తే.. ఎంత స్టార్ హీరోలకు అయినా.. పెద్దగా బడ్జెట్ అవసరం లేని కథలను యంగ్ డైరెక్టర్ తయారు చేసుకుంటారు. అలా సిద్ధం చేసుకున్న కథలను ఉత్కంఠను రేకెత్తించే విధంగా తెరకెక్కించడం నెల్సన్ ప్రత్యేకత. ముఖ్యంగా ప్లాప్ అయిన సినిమా అయినా.. అది ప్లాప్ అయ్యింది అనిపించకుండా.. సినిమాచేస్తాడు నెల్సన్. దానికి బెస్ట్ ఎక్జాంపుల్ బీస్ట్ సినిమా.
భీస్ట్ సినిమా భారీగా కనిపించినప్పటికీ సన్ పిక్చర్స్ వారికి పెద్ద ఖర్చుకాలేదని తెలుస్తోంది. ఇక బీస్ట్ సినిమా కథ కూడా అంతే ఈ మూవీ కథ అంతా కూడా ఒక షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. ఈ కారణంగానే ఈ సినిమా విజయ్ కి గల క్రేజ్ కి తగిన వసూళ్లను రాబట్టకపోయినా నష్టాలు మాత్రం రాలేదు. అందువల్లనే వాళ్లు అదే దర్శకుడితో రజనీ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాకి రీసెంట్ గా జైలర్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో రజనీ జైలర్ గా కనిపిస్తాడట. కథ అంతా జైల్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ప్రత్యేకంగా వేసిన జైల్ సెట్ లోనే దాదాపు షూటింగు జరుగుతుందని సమాచారం. పెద్ద హీరోలతో చిన్న బడ్జెట్ లో.. సింపుల్ కంటెంట్ తో ఆడియన్స్ ను మెప్పించడం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కు మాత్రమే తెలిసిన స్టైల్ గా మారింది. ఇక రజనీ కాంత్ తో కూడా ఇదే ఫార్ములాతో సినిమా చేసి.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.