స్టార్ హీరో బిచ్చమెత్తుకున్నాడట!

rajkumar hirani about sanju movie
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి 

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రన్ బీర్ నటనకు గాను ప్రశంసలు దక్కాయి. ట్రైలర్ ను బట్టి ఈ సినిమాలో సంజయ్ దత్ డ్రగ్స్ కు అలవాటు పడటం, అక్రమ ఆయుధాలు, జైలు శిక్ష ఇలా చాలా విషయాలను ప్రస్తావించనున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రన్ బీర్ కపూర్ రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇది నిజంగానే సంజయ్ దత్ జీవితంలో జరిగిందని చిత్రబృందం చెబుతోంది. సంజయ్ డ్రగ్స్ కు అలవాటు పడటంతో చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే అక్కడ రిహాబ్ సెంటర్ నుండి తప్పించుకు పారిపోయి తన స్నేహితుల ఇంటికి చేరుకోవడం కోసం అక్కడ రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నారట.

సరిగ్గా ఇదే విషయాన్ని పోస్టర్ పై రాసి రన్ బీర్ కపూర్ ఫోటోను విడుదల చేశారు. ఆయన జీవితం ఎన్నో ఒడుదొడుకులతోకూడుకున్నదని, కొన్ని విషయాలు నమ్మలేని విధంగా ఉంటాయని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ట్వీట్ చేశారు. 

loader