తమిళ రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఇక సినీ తారలు సైతం రాజకీయ ఎంట్రీకి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఇప్పటికే విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తన పార్టీని ప్రకటించి ఏకంగా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాడు. ఇప్పుడు రజనీ సైతం తన రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కసరత్తలు షురూ చేస్తున్నారు. 

చాలా రోజులుగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని రజనీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. రేపు నవంబర్‌ 30న అభిమాన సంఘాలకు చెందిన అధ్యక్షులతో మీటింగ్‌ నిర్వహించబోతున్నారు.

 చెన్నైలో ఈ మీటింగ్‌ సోమవారం ఉండబోతుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఈ మీటింగ్‌ ఉంటుందని, అనంతరం తన రాజకీయ ఎంట్రీపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సారైనా క్లారిటీ ఇస్తారా?ఇంకా సస్పెన్స్ ని కొనసాగిస్తారా? అన్నది మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం రజనీ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు.