రజనీకాంత్ ఏ పాత్ర చేసినా అందులో తనదైన స్టైల్ ని నింపటమే కాదు..ఎంతో కొంత విభిన్నత ఉండాలని చూస్తారు. అదే విధంగా ఇప్పుడు ఆయన చేస్తున్న దర్బార్ చిత్రంలోనూ ఓ డిఫరెంట్ రోల్ ని ప్లే చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ప్రముఖ దర్శకుడు ఎఆర్ మురగదాస్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారు. అయితే రెగ్యులర్ పోలీస్ పాత్ర కాదు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు.

ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఓ సీన్ ని  కూడా ఇటీవల మురగదాస్ చాలా ఇంటెన్స్ తో  తెరకెక్కించారని సమాచారం. ఈ నెలాఖరులో మొదటి షెడ్యూల్‌ పూర్తికానుందని తెలుస్తోంది. ఆ తర్వాత కొంత గ్యాప్  తీసుకుని రెండో షెడ్యూల్‌ను షూటింగ్ ప్రారంభించనున్నారు. 

ప్రస్తుతం తొలిషెడ్యూల్‌ షూటింగ్  ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. రజనీకాంత్ రీసెంట్ గా   వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ సర్పైజ్ ఉందిట. అది ఈ చిత్రంలో రజినీ రెండు పాత్రల్లో నటించనున్నారు.

అయితే రజనీ ద్విపాత్రాభినయం అనేది కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఈ సినిమాలో ఆయన తండ్రి, కొడుకులగా కనిపించనున్నారట.  ఆ పాత్రల్లో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరొకటి సోషల్ యాక్టివిస్ట్ గా కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు ఒకరినొకరు ఎదురపడే సీన్స్ సినిమా హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ యాక్టవిస్ట్ పాత్రను ..ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ...ఎనకౌంటర్ చేసే సీన్ ఉందని చెప్తున్నారు. 

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్థార్ నయనతార హీరోయన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగు , తమిళ , హిందీ భాషల్లో వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.