సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న నయా మూవీ `జైలర్`. ఈ సినిమాకి రజనీ, తమన్నా, మోహన్‌లాల్ పారితోషికాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న నయా మూవీ `జైలర్`. భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో రజనీ నటించిన `జైలర్` మూవీ మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గూస్ బంమ్స్ తెప్పించేలా ఉంది. పాత రజనీని ప్రతిబింబిస్తుంది. ఈ సారి సాలిడ్ హిట్ గ్యారంటీ అనేలా ఉంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించగా, మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి రజనీ, తమన్నా, మోహన్‌లాల్ పారితోషికాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. సినిమా బడ్జెట్‌కి, క్యాస్టింగ్ రెమ్యూనరేషన్సే 60శాతం ఉండటం విశేషం. `జైలర్` చిత్రానికి రజనీకాంత్‌కి ఏకంగా రూ.110కోట్లు పారితోషికంగా ఇచ్చారని సమాచారం. ప్రభాస్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా రజనీ నిలవడం విశేషం. మరోవైపు మోహన్‌లాల్ కి రూ.8కోట్లు ఇచ్చారట. ఇందులో ఆయనది గెస్ట్ రోల్. కాకపోతే కాస్త ఎక్కువ నిడివి ఉంటుందట.
వీరితోపాటు శివరాజ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లకు రూ.4కోట్లు పారితోషికం అందించినట్టు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంకోవైపు తమన్నా పారితోషికం కూడా వైరల్‌గా మారింది. ఆమెకి రూ.3కోట్లు ఇచ్చారట. యోగిబాబుకి రూ కోటి, రమ్యకృష్ణకి రూ.80లక్షలు, సునీల్ కి రూ.60-70లక్షల వరకు పారితోషికం అందించారట. ఇతర కాస్టింగ్‌కి మరో కోటీ నుంచి రెండు కోట్ల వరకు అయి ఉంటుందని, టెక్నీషియన్లకి ఓ ఐదు కోట్ల వరకు అవుతుందని తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాకి పారితోషికం రూపంలోనే ఈ సినిమాకి రూ.140-150కోట్ల వరకు ఇచ్చారని తెలుస్తుంది.
ఇక సినిమా బడ్జెట్ రూ.225కోట్ల అని సమాచారం. ఈ లెక్కన సుమారు 60శాతం బడ్జెట్ కేవలం పారితోషికం రూపంలోనే చెల్లించారు. ఇక షూటింగ్‌కి మిగిలినది ఖర్చు చేశారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు దుమ్మురేపాయి. తమన్నా నర్తించిన `కావాలయ్యా` సాంగ్ ఇండియాని షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 10న రిలీజ్ కాబోతుంది.
