తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బుధవారం నాడు సాయంత్రం హఠాత్తుగా బెంగుళూరు నగరానికి వెళ్లారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన సోదరుడు రావు గైక్వాడ్ (77)ని రజినీ పరామర్శించారు.

హాస్పిటల్ లో దాదాపు గంట సేపు గడిపిన ఆయన తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ హాస్పిటల్ కి వచ్చాడని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అతడి చూడడానికి గూమిగూడారు.

ఈ క్రమంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సినిమాల విషయానికొస్తే.. 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీ ప్రస్తుతం 'దర్బార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.