సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతోంది. దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. సినిమా ఎలా ఉందనే విషయంపై సెన్సార్ సభ్యుల నుండి ఎలాంటి లీకులు అందలేదు.

భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకటం ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని చెబుతున్నారు. రజినీకాంత్ చిత్తూ పాత్ర, అక్షయ్ కుమార్ క్రోమ్యాన్ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచడం ఖాయమని అంటున్నారు. 

సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని.. క్లైమాక్స్ ఎపిసోడ్ కథకు పూర్తి న్యాయం చేసే విధంగా ఉంటుందని టాక్. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హక్కులను రెండు తెలుగు  తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకి అమ్మారు. ఆ స్థాయిలో సినిమా వసూళ్లు సాధించాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే!