రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కు థియోటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే జనం సినిమా చూడటం మానేసి సూపర్ స్టార్స్ తో సెల్ఫీలు దిగుదామా, షేక్ హ్యాండ్ ఇద్దామా అన్నట్లు ఎగబడతారు. అభిమానుల మాటను స్టార్స్ తీసేయలేదు. దాంతో చాలా ఇబ్బంది వస్తుంది. 

అందుకే స్పెషల్ షో వేయించుకుని ఒంటిరిగా చూసేస్తూంటారు సినిమావాళ్లు. కానీ వాళ్లకు తమ సినిమాని కు జనం నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలుసుకోవాలంటే మాత్రం థియోటర్ కు వెళ్లి చూడాల్సిందే. అదే పనిచేసారు రజనీకాంత్. తన తాజా చిత్రం ని జనంతో పాటే కూర్చుని చూసారు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ '2.O'. రజనీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెన్నైలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోతున్నాయి. 

ఈక్రమంలో నిన్న రాత్రి రజనీకాంత్‌.. నగరంలోని ఓ థియేటర్‌లో  '2.O' సినిమాను చూశారు. కుటుంబసభ్యులతో కలిసి 'సత్యం సినిమాస్‌'కి విచ్చేసిన రజనీని చూసి ఫ్యాన్స్‌ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.  వారిని కంట్రోలు చేయటం చాలా కష్టమైందని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ స్పందన థియోటర్ లో స్వయంగా చూసిన రజనీ చాలా ఆనందపడిపోయారట.