షాకింగ్: ఫేస్ బుక్ లో 'కాలా'!

Rajinikanth's Kaala leaked on Facebook
Highlights

స్టార్ హీరోల సినిమాలలో సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుండడం

స్టార్ హీరోల సినిమాలలో సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుండడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఇక విడుదలైన కొద్ది గంటల్లో సినిమా పైరసీ ప్రింట్ కొన్ని వెబ్ సైట్లల్లో దొరికేస్తుంది. కొంతమంది ఏకంగా ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా పైరసీకు పాల్పడుతున్నారు. తాజాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాలా' సినిమాను సైతం పైరసీ చేయడం షాకింగ్ గా మారింది.

దాదాపు 40 నిమిషాల సినిమా ఆన్ లైన్ లో కనిపించడంతో మేకర్స్ తో పాటు అభిమానులు షాక్ కు గురయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఓవర్సీస్ లో ఒకరోజు  ముందుగానే సినిమాలు విడుదలవుతుంటాయి. 'కాలా'ను కూడా ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు. సింగపూర్ లో ప్రవీణ్ తేవార్ అనే వ్యక్తి ఈ ప్రీమియర్ చూడడానికి వెళ్లి ఫేస్ బుక్ లైవ్ ద్వారా సినిమాను షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ వెంటనే అధికారులను సంప్రదించి పైరసీ చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేయించారు. 

 

 

 

loader