పేట సినిమాతో రాజనీకాంత్ తన కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్(BO) హిట్ అందుకున్నాడు. సినిమాపై టాక్ ఎలా ఉన్నప్పటికీ తలైవా అభిమానులకు చాలా వరకు ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో మంచి కిక్ ఇచ్చింది. కోలీవుడ్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న రజినీ పేట ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ లో సెంచరీ కొట్టేసింది., 

వరల్డ్ వైడ్ గా పేట సినిమా 100 కోట్ల గ్రాస్ ను అందుకోవడంతో రజినీ కాంత్ కెరీర్ లో 100కోట్ల క్లబ్ లో చేరిన 7వ సినిమాగా చిత్రం రికార్డును అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. ఇక అజిత్ వివేగం కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా 90 కోట్ల వరకు క్రాస్ చేసినట్లు సమాచారం. తెలుగు తమిళ్ హిందీలో 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పేట 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

అన్ని బిజినెస్ లను కలుపుకొని 50 కోట్ల లాభంతోనే ఉన్న పేట ఇప్పుడు షేర్స్ రూపంలో నిర్మాతలకు మరింత లాభాన్ని అందించడానికి సిద్ధమైంది. యూఎస్ లో కూడా రజినీ సినిమా డాలర్స్ ను బాగానే రాబడుతోంది. $2 మిలియన్ క్రాస్ అవ్వడంతో హాలిడేస్ లో మరిన్ని లాభాలు వచ్చేలా ఉన్నాయని సమాచారం.