Asianet News TeluguAsianet News Telugu

మళ్ళీ అమెరికాకు రజినీకాంత్!

రజినీకాంత్ పదే పదే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లడం అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. గతంలో పలుమార్లు ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో వారు కంగారు పడుతున్నారు. 

rajinikanth off to america for health check ups ksr
Author
Hyderabad, First Published Jun 19, 2021, 10:56 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ మరలా అమెరికా వెళ్లినట్లు సమాచారం. గత రాత్రి రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్ట్ కి సతీసమేతంగా వచ్చారు. భార్యతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నట్లు తెలుస్తుంది. సాధారణ వైద్య పరీక్షల కోసం రజినీకాంత్ అమెరికా వెళుతున్నట్లు వినికిడి.  కారులో రజినీకాంత్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే మీడియా ఆయన చుట్టూ చేరగా, అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్లారు. 


మరోవైపు రజినీకాంత్ పదే పదే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లడం అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. గతంలో పలుమార్లు ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో వారు కంగారు పడుతున్నారు. రజినీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం అభిమానుల ఆందోళనకు కారణం అవుతుంది. 


ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ పోటీ చేయాలని అనుకున్నారు. ఆరోగ్య కారణాలతో రజినీకాంత్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఫ్యాన్స్ ని రజినీకాంత్ నిర్ణయం చాలా ఇబ్బంది పెట్టింది. మరోవైపు రజినీకాంత్ అన్నాత్తే మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, మీనా, కుష్బూ, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios