సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'దర్బార్' సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలో రజినీకాంత్ సరదాగా యూనిట్ తో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. 'ఇది తలైవా ఐపీఎల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ తో పాటు నయనతార కూడా కనిపిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ కూతురిగా నివేదా థామస్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. మళ్లీ ఇంతకాలానికి వెండితెరపై పోలీస్  యూనిఫాంలో కనిపించనున్నారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై పెక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.