ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న రజనీకాంత్‌ కూలీల వద్ద డబ్బుల అడుక్కోవాల్సి వచ్చిందట. అనుకోకుండా ట్రైన్‌ టికెట్టు పోగొట్టుకున్న రజనీకాంత్‌, ట్రైన్‌ టికెట్‌ కలెక్టర్‌కి దొరికిపోవడంతో ఫైన్‌ కట్టాల్సి వచ్చిందట.

రజనీకాంత్.. సౌత్‌లో మాత్రమే కాదు ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా ఆయన్ని కీర్తించవచ్చు. తిరుగులేని ఇమేజ్‌ ఆయన సొంతం. ఏడుపదుల వయసులోనూ తరగని ఎనర్జీ ఆయన సొంతం. ఇప్పటికీ ఆయన ఇమేజ్‌ చెక్కుచెదరలేదంటూ అతిశయోక్తి లేదు. ఆయన నటించే సినిమాలు విడుదలైతే పలు ఐటీ కంపెనీలు సెలవులివ్వడం ఇప్పటికీ జరుగుతుంది. ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న రజనీకాంత్‌ కూలీల వద్ద డబ్బుల అడుక్కోవాల్సి వచ్చిందట. 

అనుకోకుండా ట్రైన్‌ టికెట్టు పోగొట్టుకున్న రజనీకాంత్‌, ట్రైన్‌ టికెట్‌ కలెక్టర్‌కి దొరికిపోవడంతో ఫైన్‌ కట్టాల్సి వచ్చిందట. కానీ తన వద్ద డబ్బులు లేవని, దీంతో అందులో ఉన్న కూలీల వద్ద డబ్బులు అడుకునే పరిస్థితి వచ్చిందన్నారు రజనీకాంత్‌. మరి ఇంతకి ఏం జరిగింది? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తలెత్తిందనేది చూస్తే, తాను చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు సూపర్‌ స్టార్‌. 

ఇంకా హీరోగా రాణించని రోజులవి. ఎస్సెస్సీ చదువుకునే రోజుల్లో పరీక్ష ఫీజు కోసం ఇంట్లో రూ.150 ఇచ్చారట. పరీక్ష ఫెయిల్‌ అవుతానని తనకు ముందే తెలుసు. అందుకే మద్రాస్‌ ట్రైన్‌ ఎక్కాడట. మార్గ మధ్యలో ట్రైన్‌ టికెట్‌ పడిపోయింది. టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ కి జరిగిన విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందే అంటూ అందరి ముందు అరిచాడట. దీంతో అక్కడే ఉన్న ఐదురుగురు కూలీలు తనకు డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. తాను టికెట్‌ తీసుకున్న విషయం వారికి చెప్పినా వినలేదట. చివరికి కూలీలతో ఆ విషయం చెప్పగా, అప్పటిగానీ ఆ టికెట్‌ ఇన్ స్పెక్టర్‌ తనని నమ్మలేదని చెప్పారు. అలా మొదటిసారి తనని ఓ వ్యక్తి నమ్మడం జరిగిందనని, నమ్మకమనేది అప్పుడు స్టార్ట్ అయ్యిందన్నారు రజనీ. 

ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మొదటి సారి దర్శకుడు కె. బాలచందర్‌ నమ్మాడని, ఆయన నమ్మకాన్ని గెలిపించానని, ఇప్పుడు ప్రజలు తనపై నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కానివ్వను అని తెలిపారు రజనీ. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అయితే ఏ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడనేది క్లారిటీ లేదు. కానీ ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు `లైకా` ప్రొడక్షన్‌లో మరో రెండు సినిమాలు చేస్తున్నారు సూపర్‌ స్టార్‌.