సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లత రజనీల పెళ్లి రోజు రేపు(ఫిబ్రవరి 26). ఆదివారంతో వీరిద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి నలభై ఏళ్ళ  పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి కూతురు ఐశ్యర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లత రజనీల పెళ్లి రోజు రేపు(ఫిబ్రవరి 26). ఆదివారంతో వీరిద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి నలభై ఏళ్ళ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి కూతురు ఐశ్యర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. `ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యార`ని తెలిపింది. 

ఐశ్వర్య ఇంకా చెబుతూ, `ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మా నాన్న జీవితాలను చూసి తెలుసుకున్నా. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్‌ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నేను నమ్ముతున్నా. మ్యారేజ్‌ అంటే ఒకరి బాధ్యతని మరొకరు మోయడం అనేవిషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నా. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం. అప్పా, అమ్మా మీ ఇద్దరికీ సూపర్‌ డూపర్‌ మ్యారేజ్‌ యానివర్సరి శుభాకాంక్షలు` అని తెలిపింది. 

View post on Instagram

రజనీ, లత 1981 ఫిబ్రవరి 26న ఒక్కటయ్యారు. రేపటితో నలభై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. వీరికి ఇద్దరు కూతుర్లు ఐశ్వర్య‌, సౌందర్య ఉన్నారు. ఐశ్వర్య ప్రముఖ హీరో ధనుష్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్‌, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు.