సినిమాలో  రజనీకాంత్‌ కనపడేది అరగంటే అంటే అది రజనీ చిత్రం ఎలా అవుతుందని, అంతంత రేట్లు చెప్తే ఎలా అని  డిస్ట్రిబ్యూటర్స్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.


జైలర్ చిత్రం సూపర్ హిట్ అవ్వటంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయనతో సినిమా అంటే ఇప్పుడు అభిమానులు మినిమం ఎక్సపెక్ట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగులో ఆయనకు ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే జైలర్ ఇంపాక్ట్ ఆయన తాజా చిత్రం ‘లాల్‌ సలాం’ బిజినెస్ పై కనపడటం లేదు. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ఉత్సాహంగా తీసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదని తెలిసింది. అందుకు కారణం ఈ స్పోర్ట్స్ డ్రామాకు రెగ్యులర్ రజనీ సినిమా స్దాయిలో రేట్లు అడటం అని తెలుస్తోంది. దాంతో డైరక్ట్ గా రైట్స్ తీసుకుని రిలీజ్ చేయలేమని, షేర్ బేసిస్ లో రిలీజ్ చేస్తామని ఎగ్రిమెంట్ కు వచ్చారని తెలుస్తోంది. 

 ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యే ‘లాల్‌ సలాం’సినిమాలో రజనీ కనపడేది కేవలం అరగంటే అని తెలిసింది. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా రజనీకాంత్, కపిల్‌ దేవ్, జీవితా రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించారు. ‘‘లాల్‌ సలాం’ చిత్రంలో ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌. సినిమాలో ఆయన కనపడేది అరగంటే అంటే అది రజనీ చిత్రం ఎలా అవుతుందని, అంతంత రేట్లు చెప్తే ఎలా అని డిస్ట్రిబ్యూటర్స్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

రజినీకాంత్ కేవలం అరగంట పాటు ఉండే పాత్రలో కనిపిస్తాడని తమిళ సినీ వర్గాల సమాచారం. ఇంకా తక్కువే ఉంటుందేమో కానీ అంతకు మించి ఉండదు ఆయన పాత్ర అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తి చేసుకుని రిలీజ్ కు ముస్తాబు అవుతోంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. “లాల్ సలాం” చిత్రానికి దర్శకురాలు ఐశ్వర్య. ఆమె రజినీకాంత్ పెద్ద కూతురు, ధనుష్ మాజీ భార్య.